నారాయణపేట: అపరిచితుల పట్ల విద్యార్థులు జాగ్రత్త: షీ టీమ్

299చూసినవారు
నారాయణపేట: అపరిచితుల పట్ల విద్యార్థులు జాగ్రత్త: షీ టీమ్
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం షీ టీమ్ పోలీసులు కవిత, జ్యోతి విద్యార్థినులకు 'గుడ్ టచ్, బ్యాడ్ టచ్'పై అవగాహన కల్పించారు. అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోరాదని, వారి మాయమాటలు నమ్మవద్దని సూచించారు. ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని లేదా తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్