నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో ఆదివారం ఉదయం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద పోలియో చుక్కల కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ వెంకట్రాములు గౌడ్ ప్రారంభించారు. ప్రతి తల్లిదండ్రులు తమ ఐదు సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం వల్ల వారి భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కే శ్రీనివాస్, వార్డు సభ్యులు మహేష్, రఫీ, పరశురాం, ఏఎన్ఎం అనురాధ, అంగన్వాడి టీచర్లు బుగ్గమ్మ, వెంకటలక్ష్మి, రుక్మిణి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.