నారాయణపేట్ మండలం అభంగాపూర్ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇంటిని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి,
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోట్ల రవీందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తోందని, ఇచ్చిన మాట తప్పని పార్టీ
కాంగ్రెస్ అని అన్నారు. మండలంలో అనేక గ్రామాల్లో ప్రజలు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుని సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవి, వార్డు మెంబర్ అనిత,
కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.