పాఠశాల అభివృద్ధికి సర్పంచ్ రూ.34 వేలు విరాళం

671చూసినవారు
పాఠశాల అభివృద్ధికి సర్పంచ్ రూ.34 వేలు విరాళం
నారాయణపేట జిల్లా, నారాయణ్ పేట్ లోని మాద్వార్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు అండగా నిలిచారు. పాఠశాల అప్‌గ్రేడ్, 6వ, 7వ తరగతుల ప్రారంభం, విద్యా వాలంటీర్ల నియామకం, నిధుల సమీకరణ వంటి అంశాలపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తన ఐదు నెలల జీతం రూ.34 వేలను పాఠశాల అభివృద్ధికి విరాళంగా ప్రకటించారు. గ్రామసభలో మొత్తం రూ.1.10 లక్షల విరాళాల హామీ లభించింది.

సంబంధిత పోస్ట్