ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో విఫలం: పీవైఎల్

27చూసినవారు
ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో విఫలం: పీవైఎల్
ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. రామకృష్ణ నారాయణపేటలో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం నామమాత్రంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పీజీలు, బీఈడీలు పూర్తి చేసిన వేలాది మంది యువత ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి కూడా అందడం లేదని తెలిపారు. తక్షణమే నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్