నారాయణ పేట జిల్లా, గుండుమాల్ మండలంలో నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ విగ్రహం వద్ద గౌరవ తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు, గాయకుడు, రాష్ట్ర మాజీ గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ వేద సాయి చంద్ మౌర్య గారి మూడవ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. సాయి చందన్న గారి ఫోటోకు పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గుండుమాల్ మండల నాయకులు, వివిధ మండలాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యావంతులు, AK స్పోర్ట్స్ అకాడమీ సంస్థ చైర్మన్ అంజన్న యాదవ్, తెలంగాణా ప్రజా ఉద్యమ నాయకులు గౌరగళ్ళ కృష్ణ మౌర్య, మాజీ సర్పంచ్ సాయిలు, మల్లేష్ పాల్గొన్నారు.