ఎల్లమ్మ అమ్మవారికి వేపచీర, మేకతో మొక్కులు: ఘనంగా బండారు ఉత్సవం

142చూసినవారు
ఎల్లమ్మ అమ్మవారికి వేపచీర, మేకతో మొక్కులు: ఘనంగా బండారు ఉత్సవం
మరికల్ మండల పరిధి కన్మనూర్ గ్రామంలో ఆవుల కులస్తులు ఎల్లమ్మ అమ్మవారికి వేపచీర, మేక పొట్టేలు, నైవేద్యంగా సమర్పించి, ఎల్లమ్మ, బీరప్ప బండారు ఉత్సవాన్ని శుక్రవారం ఉదయం 11:00 గంటలకు ఘనంగా నిర్వహించారు. తమ వ్యాపారాలు చల్లగా ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదానం, బంధుమిత్రులు ఒకరిపై ఒకరు పసుపు బండారు చల్లుకున్నారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవం తరతరాలుగా వస్తున్న ఆచారమని పూజారి బాలప్ప తెలిపారు.

సంబంధిత పోస్ట్