నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ముష్టిపల్లికి చెందిన శేఖర్, అమీర్, మరో నలుగురితో కూడిన ముఠాను అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. వీరు జింకలు, నెమళ్లను వేటాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వారి వద్ద నుంచి ఒక కారు, గన్, సుమారు రూ.8 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణులను వేటాడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.