నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ అరుణ మాట్లాడుతూ, యువత ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకొని హిందూ సమాజాన్ని జాగృతి పరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.