కొత్తకోట పట్టణంలోని 15వ వార్డులో తీవ్ర కలకలం రేగింది. ఇళ్లకు ముందు ఆడుకుంటున్న ఎండీ మహమ్మద్ ఖాన్ మూడేళ్ల కుమారుడిపై ఓ పిచ్చికుక్క ఒక్కసారిగా దాడికి తెగబడింది. బాలుడి చెంప, పెదవులపై విచక్షణారహితంగా కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు బాలుడిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.