వనపర్తిలోని స్థానిక పాత బస్టాండ్ ఆవరణలోని
ఎన్టీఆర్ లలితకళాతోరణాన్ని మున్సిపల్ సామాన్ల గోదాముగా మార్చడంపై సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల సాంస్కృతిక కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ భవనాన్ని వెంటనే ఖాళీ చేయించి, తిరిగి కళలు, సామాజిక కార్యక్రమాలకు అప్పగించాలని కోరుతూ, యోగా గురువు ఓంకార్, నీరజాదేవి, కరాటే మాస్టర్ శేఖర్ తో కలిసి మున్సిపల్ కమిషనర్ నిరంజన్, వార్డు కౌన్సిలర్ బ్రహ్మకు వినతిపత్రం అందజేశారు.