తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర స్థాయి సమావేశంలో వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి గంగవరం రామకృష్ణారెడ్డి, జిల్లా జర్నలిస్టుల అక్రిడిటేషన్, సంక్షేమ పథకాలు, భద్రత, అధికారుల సహకారం వంటి సమస్యలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. మండల స్థాయి వరకు సంఘాన్ని బలోపేతం చేయాలని, యువ జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. వనపర్తి జిల్లా యూనిట్ రాష్ట్ర సంఘానికి సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.