TG: ఎమ్మెల్యే మేఘారెడ్డి, పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై కూడా వేటు తప్పదనే చర్చ జరుగుతోంది. పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇప్పటికే ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని నివేదిక అందజేసింది. అధిష్టానం చిన్నారెడ్డిని పదవి నుంచి తప్పిస్తూ ప్రస్తుత మహిళ కమిషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న గద్వాల విజయ లక్ష్మిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్‌పర్సన్‌గా నియమించాలనే ఆలోచనలో ఉన్నట్లు
కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం.