ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో వరుసగా విఫలమైన భారత వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై ఒత్తిడి పెరుగుతోంది. టీ20 ఫార్మాట్‌లో గిల్ ఇంకా రాణించకపోవడంతో, యశస్వి జైస్వాల్ వంటి ప్లేయర్లకు అవకాశం దక్కే అవకాశముంది. ఈ నేపథ్యంలో గోల్డ్ కోస్ట్‌లో ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ గిల్‌ను పక్కకు పిలిచి సీరియస్‌గా మాట్లాడాడు. ఈ వీడియో తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.