TG: హైదరాబాద్లోని ముషీరాబాద్ డిపో నుంచి శ్రీశైలానికి బయలుదేరిన ఒక ఆర్టీసీ స్పెషల్ బస్సులో వినాయక నిమజ్జనానికి విగ్రహాలను తీసుకెళ్లడం భక్తులకు కొత్త అనుభూతినిచ్చింది. సాధారణంగా లారీలు, ట్రాక్టర్లలో విగ్రహాలను తరలించే క్రమంలో ఖర్చు, ఇబ్బందులు ఉంటాయని, ఈసారి భక్తులు ఆర్టీసీ బస్సులోనే గణపయ్యను సీట్లలో కూర్చోబెట్టి భక్తిశ్రద్ధలతో శ్రీశైలం వరకు తీసుకెళ్లారు. ఈ వినూత్న దృశ్యం ప్రయాణికులను, బాటసారులను ఆకట్టుకోవడమే కాకుండా, సోషల్ మీడియాలోనూ ఆసక్తికర చర్చగా మారింది.