
కారు ఓపెన్ టాప్ పైకెక్కి మందుబాబు వికృత చేష్టలు.. వీడియో వైరల్
AP: సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి గ్రామం సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలో ఓ మందుబాబు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. కారు ఓపెన్ టాప్పైకెక్కి విచిత్రంగా ప్రవర్తించాడు. కారు రన్నింగ్లో ఉండగా కారుపైకి ఎక్కి పడుకున్నాడు. దీంతో వాహనం అదుపు తప్పి గోడను ఢీకొట్టింది. ప్రాణపాయం అయితే తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




