పూణేలో జరిగిన గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపులో ఒక 65 ఏళ్ల వృద్ధురాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డీజే పాటల మోతకు మైమరిచిపోయిన ఆమె ఏకంగా ట్రాక్టర్ ట్రాలీపైకి ఎక్కి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. వయస్సును పక్కనపెట్టి ఆమె చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ ఊరేగింపులో పాల్గొన్న వారిని ఎంతగానో ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వడంతో వైరల్‌గా మారింది. బామ్మ ఉత్సాహాన్ని చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.