TG: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవాలు కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్‌తో పాటు ఇతర చెరువులకు విగ్రహాలు భారీగా వస్తున్నాయి. ట్యాంక్ బండ్ పరిసరాలు భక్తులు, విగ్రహాలతో కిక్కిరిసిపోయాయి. బషీర్ బాగ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు నిమజ్జన ప్రక్రియ కొనసాగే అవకాశముంది. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.