
క్యాబ్ ఎక్కుతుండగా యువతికి ముద్దుపెట్టిన సెక్యూరిటీ గార్డు
హైదరాబాద్ గచ్చిబౌలిలో క్యాబ్ ఎక్కుతున్న మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు వేధింపులు ఎదురయ్యాయి. వైజాగ్‌కు చెందిన 24 ఏళ్ల యువతి ఐటీ ఉద్యోగం చేస్తూ ఇందిరానగర్‌లోని పీజీలో ఉంటోంది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు క్యాబ్ ఎక్కుతుండగా.. ఓ వ్యక్తి ఆమెను పక్కకు లాగి ముద్దు పెట్టి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి జార్ఖండ్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు రాజ్‌కుమార్ (25)ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.




