TG: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మంగళవారం గణేశ్ నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఒకప్పుడు మత ఘర్షణలకు కేంద్రంగా ఉన్న భైంసాలో, ఈసారి 'హిందూ ముస్లిం భాయ్ భాయ్' అంటూ నినాదాలు వినిపించాయి. సున్నితమైన ప్రాంతం కావడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసి, సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘాతో పాటు అదనపు బలగాలను మోహరించి శోభాయాత్రను పర్యవేక్షించారు.