వినాయక నిమజ్జనం.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు పొడిగింపు

3124చూసినవారు
వినాయక నిమజ్జనం.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు పొడిగింపు
TG: భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 25 శనివారం అర్ధరాత్రి వరకు హైదరాబాద్ మెట్రో రైలు సేవలను పొడిగించినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు నడుస్తాయి. చివరి రైళ్లు ఒంటి గంటకు చివరి స్టేషన్‌కు చేరుకుంటాయి. ఖైరతాబాద్, లక్డీకాపూల్ స్టేషన్లలో అదనపు పోలీసు, సెక్యూరిటీ సిబ్బందిని మోహరించారు. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి అదనపు టికెట్ కౌంటర్లు, రైళ్లు నడపనున్నారు. సెప్టెంబర్ 26న ఉదయం 6 గంటలకు సాధారణ సేవలు పునఃప్రారంభమవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్