రూ.30 లక్షల విలువైన గంజాయి స్మగ్లింగ్.. ముఠా అరెస్ట్ (వీడియో)

42చూసినవారు
AP: పోలవరం జిల్లా అడ్డతీగలలో గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వేటమామిడి జంక్షన్‌లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. రూ.30 లక్షల విలువైన గంజాయి, కారు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని దారకొండ నుంచి రాజమండ్రికి గంజాయిని తరలిస్తుండగా స్మగ్లర్లను పట్టుకున్నారు. నిందితులు సునీల్ కృష్ణ, సుభాష్ మణికంఠ, షేక్ సైదా, పుష్పరాజ్, గురుప్రసాద్, సందేశ్‌గా పోలీసులు గుర్తించారు. మున్నా, అరవింద్ పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్