TG: కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు బ్లాక్ దందా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లకు అధిక ధరలకు సిలిండర్లు అమ్ముతుండగా పట్టుకున్నారు. నిందితుల నుంచి 300 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. సిలిండర్‌ను రూ.6 వేలకు డీలర్ అమీర్ విక్రయిస్తున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించి, అతడితో పాటు మరో 10 మందిని అరెస్టు చేశారు.