బిహార్‌లోని సుపాల్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా ఆర్కెస్ట్రా డ్యాన్సర్ (29) ప్రదర్శన ముగించుకుని తన తోటి డ్యాన్సర్ ఇంటికి తిరిగి వెళుతుండగా.. లాల్తు కుమార్ అనే వ్యక్తి ఆమెను ఇంటి వద్ద దింపుతానని చెప్పి ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న మరో ఇద్దరితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోయిన ఆమెను వదిలేసి వెళ్ళిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు.