ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో గ్యాంగ్‌వార్ కలకలం రేపింది. ఒక యువకుడిని దారుణంగా హత్య చేశారు. హాషిం బాబా గ్యాంగ్‌కు చెందిన మిస్బా అనే యువకుడు కారులో వెళ్తుండగా, ఒక నిమిషంలో 15 రౌండ్ల కాల్పులు జరిపి దుండగులు అతన్ని చంపేశారు. ఈ కాల్పుల కారణంగా అతను ఘటనా స్థలంలోనే మరణించాడు. ఈ హత్యను గ్యాంగ్‌వార్ కారణంగా జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.