గంజాయి మత్తులో పోకిరీల వీరంగం.. బడితపూజ చేసిన స్టూడెంట్స్

19చూసినవారు
జగిత్యాల జిల్లా ధర్మారం మండలం సమీపంలోని ఓ పెట్రోల్ బంక్‌లో గంజాయి మత్తులో యువకులు సిబ్బందితో గొడవపడ్డారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ విద్యా సంస్థకు చెందిన టూరిస్ట్ బస్సులోని విద్యార్థులతోనూ వారు వాగ్వాదానికి దిగారు. విద్యార్థిని, విద్యార్థుల ముందే పోకిరీల విచ్చలవిడి ప్రవర్తనతో ఆగ్రహించిన విద్యార్థులు, వారిపై తిరగబడి చితకబాదారు. అనంతరం విద్యా సంస్థ, పెట్రోల్ బంక్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you