కర్ణాటకలోని బెలగావి జిల్లా అథనిలో మంగళవారం RSS సీనియర్ నేత అరవింద్ రావ్ దేశ్‌పాండే పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. రోడ్డు పక్కన పార్క్ చేసిన కారు వద్ద నిలబడి ఉండగా.. అదుపు తప్పిన మున్సిపాలిటీ చెత్త బండి కారును ఢీకొట్టింది. పక్కనే ఉన్న వ్యక్తి వెంటనే దేశ్‌పాండేను పక్కకు లాగడంతో ప్రాణాపాయం తప్పింది. చెత్త బండి డ్రైవర్ మద్యం తాగి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు.