
అర్జెంటీనా నుంచి భారత్కు రికార్డు స్థాయిలో LPG దిగుమతులు
హార్ముజ్ జలసంధిలో సంక్షోభం కారణంగా భారత్లో LPG సరఫరాపై ఆందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అర్జెంటీనా కీలక మిత్రదేశంగా ముందుకు వచ్చి, రికార్డు స్థాయిలో LPG దిగుమతులను అందిస్తోంది. 2025లో 22,000 టన్నులు మాత్రమే రాగా, 2026 తొలి మూడు నెలల్లోనే 50,000 టన్నులకు చేరింది. మార్చిలో దిగుమతులు సగానికి పడిపోతాయని అంచనాలు వెలువడిన నేపథ్యంలో, అర్జెంటీనా నుంచి వస్తున్న ఈ సరఫరా భారత్కు తాత్కాలిక ఊరటనిస్తోంది. గల్ఫ్ దేశాలపై అధిక ఆధారపడటాన్ని తగ్గిస్తూ, భారత్ ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను బలోపేతం చేస్తోంది.




