గ్యాస్ సిలిండర్ పైపు 5 ఏళ్ల తర్వాత మార్చాల్సిందే!

8253చూసినవారు
గ్యాస్ సిలిండర్ పైపు 5 ఏళ్ల తర్వాత మార్చాల్సిందే!
ప్రతీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడకం తప్పనిసరి. అయితే, సిలిండర్ నుంచి స్టవ్‌కు గ్యాస్‌ను సరఫరా చేసే పైపును ప్రతి ఐదేళ్లకు ఒకసారి మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. నాణ్యత లేని, పాతబడిన పైపులను వాడటం వల్ల గ్యాస్ లీకేజీ, అగ్ని ప్రమాదాలు సంభవించి ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. పైపుపై పగుళ్లు, తుప్పు, గట్టిదనం వంటివి కనిపిస్తే వెంటనే మార్చాలి. పైపును మార్చేటప్పుడు రెగ్యులేటర్ నాబ్ ఆపి, సరైన పైపును అమర్చి, భద్రతా క్లాంప్‌లు బిగించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్