గ్యాస్ ధరల పెంపు సామాన్యుడిపై పెనుబారం: మంత్రి ఉత్తమ్

26చూసినవారు
గ్యాస్ ధరల పెంపు సామాన్యుడిపై పెనుబారం: మంత్రి ఉత్తమ్
TG: కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరను 19 కేజీలకు రూ.993కు పెంచడంపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది సామాన్యులపై పెనుభారం మోపే నిర్ణయమని, హోటళ్లు, కేఫ్‌లు, రెస్టారెంట్లు, చిన్న తరహా వీధి వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన 24 గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం ప్రజలను మోసం చేయడమేనని ఆయన విమర్శించారు. కేంద్రం తక్షణమే ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్