
ఎల్నినో ఎఫెక్ట్.. ఈ ఏడాది చలి కూడా తక్కువే: వాతావరణ శాఖ
ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది దేశంలో చలి తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అక్టోబర్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు పోస్ట్ మాన్సూన్ సీజన్లో వర్షపాతం కూడా సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వానాకాలంలో తెలంగాణలో ఇప్పటికే 17% వర్షపాతం లోటు నమోదైంది, అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 41% లోటు ఏర్పడింది.




