
లోయలో పడిన కారు.. నలుగురు దుర్మరణం (వీడియో)
హిమాచల్ ప్రదేశ్లోని కుల్లులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంపూర్ - నిమాలా NH-305పై మంగళవారం తెల్లవారుజామున కారు లోయలో పడి నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివాహ వేడుక ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ విషాదం సంభవించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




