ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఏపీలో ఇకపై అన్ని వైద్య సేవలకు ‘112’ టోల్ ఫ్రీ నంబర్
Apr 29, 2026, 05:04 IST/

ఏపీలో ఇకపై అన్ని వైద్య సేవలకు ‘112’ టోల్ ఫ్రీ నంబర్

Apr 29, 2026, 05:04 IST
ఏపీ ప్రభుత్వం అత్యవసర వైద్య, రక్షణ సేవల రంగంలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇకపై ఏ చిన్న ఆపద వచ్చినా కేవలం ఒక్క నంబర్ ‘112’ డయల్ చేస్తే చాలు. ప్రస్తుతం అమలులో ఉన్న 108, 102, 104 వైద్య సేవలతో పాటు పోలీస్ (100), ఫైర్ (101) సేవలను కూడా ఈ 112 నంబర్‌తో అనుసంధానించనున్నారు. దీనివల్ల ప్రజలు ఆపద సమయంలో ఏ నంబర్‌కు ఫోన్ చేయాలో తెలియక తికమకపడే పరిస్థితి ఉండదు. కేంద్ర ప్రభుత్వ ‘PM రావత్’ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏకీకృత సేవల విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక అత్యాధునిక సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.