ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 32 ఏళ్ల ఆర్కెస్ట్రా కళాకారుడు, తన గే స్నేహితుడు రాంబాబు యాదవ్‌పై కత్తితో దాడి చేసి, ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంబాబు యాదవ్, ఆ కళాకారుడి ఆరేళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడటంతో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన రాంబాబును డియోరియా, గోరఖ్‌పూర్ ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు బాలిక తండ్రి ఫిర్యాదుతో రాంబాబుపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.