
హైదరాబాద్ - శ్రీశైలం హెలికాప్టర్ సేవలు
తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నూతన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలను వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ యాత్ర ద్వారా పర్యాటకులు నల్లమల అడవులు, కృష్ణమ్మ జల సవ్వడులు, ఎత్తైన కొండల అందాలను ఆకాశం నుంచి వీక్షించే అద్భుత అవకాశం లభిస్తుంది. హెలికాప్టర్ ద్వారా గంటలోపే చేరవచ్చు.




