ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై గెజిట్ విడుదలైన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన "కొత్త జోన్, కొత్త వేగం, కొత్త వృద్ధి!" అని పేర్కొన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ వృద్ధికి, అనుసంధానానికి ఒక పరివర్తనాత్మక ముందడుగు అని అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.