
ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇరాన్ ప్రతిదాడి
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. 35కు పైగా బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌పై దాడులకు తెగబడింది. కాగా 30 రాకెట్లు తమ దేశంలోకి దూసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. అయితే వాటిని తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని ఐడీఎఫ్ తెలిపింది. కాగా ఇరాన్‌లోని న్యూక్లియర్ సైట్లు, మిస్సైల్ బేస్‌లు, మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా దాడి చేసిన విషయం తెలిసిందే.




