
బీహార్ అసెంబ్లీ స్పీకర్గా ప్రేమ్ కుమార్ ఏకగ్రీవం (వీడియో)
బీహార్ అసెంబ్లీ 18వ స్పీకర్గా బీజేపీ సీనియర్ నేత ప్రేమ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు ప్రేమ్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయమైంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఆయనకు మద్దతు పలికారు. 70 ఏళ్ల ప్రేమ్ కుమార్ బీహార్ బీజేపీలో సీనియర్ నాయకులలో ఒకరు, అత్యంత వెనుకబడిన కులాల (ఇబిసి) వర్గానికి చెందినవారు. ఆయన వరుసగా తొమ్మిదవసారి గయా టౌన్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గతంలో పర్యావరణ మంత్రి, సహకార మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.




