దీపావళి సందర్భంగా పాత ఢిల్లీలోని ఘంటేవాలా స్వీట్ షాప్‌ను రాహుల్ గాంధీ సందర్శించారు. ఈ సందర్బంగా అయన స్వయంగా స్వీట్లు తయారు చేశారు. షాప్ యజమాని సుశాంత్ జైన్ రాహుల్ ను దయచేసి త్వరగా పెళ్లి చేసుకోవాలని వివాహానికి స్వీట్ల ఆర్డర్ తమకే ఇవ్వాలని సరదాగా కోరారు. అనంతరం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'గా అభివర్ణించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రాహుల్ గాంధీ కూడా ఘంటేవాలా స్వీట్ల రుచిని ప్రశంసించారు.