జీహెచ్‌ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తి.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వం

5చూసినవారు
జీహెచ్‌ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తి.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వం
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) విస్తరణ ప్రక్రియ పూర్తయింది. శివారులోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయానికి సోమవారం గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నిన్నటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రికార్డులను స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్లు, జోనల్‌ కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్