కోల్‌కతా మొదటి టెస్టులో గాయపడ్డ శుభ్‌మన్ గిల్ గువాహటి రెండో టెస్ట్‌కు ముందు ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. మెడ కండరాల పట్టేసి పూర్తిగా కోలుకోకపోవడంతో అతడు జట్టుతో గువాహటికి కూడా రాలేదని సమాచారం. గిల్ గైర్హాజరుతో రిషభ్ పంత్ రెండో టెస్ట్‌కు సారథ్యం వహించే అవకాశం ఉంది. గిల్ స్థానంలో సాయిసుదర్శన్ ప్లేయింగ్ ఇలెవన్‌లోకి రావచ్చని టాక్. ఇదే సమయంలో యువ ఆటగాళ్లు ధ్రువ్ జురేల్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్‌లు ప్రాక్టీస్‌లో శ్రమించారు.