
ఉద్యోగం ఇప్పిస్తామని మైనర్‌ను దొంగగా మార్చారు
జైలు నుంచి విడుదలైన ఇద్దరు దొంగలు టీ షాపు వద్ద పరిచయమైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతన్న మైనర్‌కు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి దొంగతనాలు చేయించిన ఘటన తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లాలో జరిగింది. ముగ్గురు కలిసి తిరుగుతూ జల్సాలు, మద్యానికి అలవాటు పడ్డారు. పోలీసుల వాహనాల తనిఖీలో బైక్ ఆపకుండా వెళ్తున్న వీరిని వెంబడించి పట్టుకున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ప్లాన్‌తో చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు.




