TG: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రేమించిన యువకుడి చేతిలో 17 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. ఒడిశాలోని బొంగుముంద గ్రామానికి చెందిన దంపతులు మిర్యాలగూడ(M) గూడూరు గ్రామ సమీపంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారు. వీరి కుమార్తె తబిరామ్ అనే యువకుడిని ప్రేమించింది. సదరు యువకుడు కూడా అదే ఇటుక బట్టిలో పని దిగాడు. ఆదివారం తాగి వచ్చిన తబిరామ్‌ను బాలిక మందలించడంతో, మద్యం మత్తులో ఆమె తలపై ఇటుకతో కొట్టి, చున్నీతో మెడకు బిగించి హత్య చేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
.