ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


వీధి కుక్కల కేసు.. నవంబర్ 7న తదుపరి ఆదేశాలు
Nov 03, 2025, 07:11 IST/

వీధి కుక్కల కేసు.. నవంబర్ 7న తదుపరి ఆదేశాలు

Nov 03, 2025, 07:11 IST
వీధి కుక్కల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జంతు సంక్షేమం, ప్రజా భద్రతల మధ్య సమతుల్యత కాపాడేందుకు దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కేసులో తదుపరి ఆదేశాలను నవంబర్ 7న వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల సీఎస్‌లు వ్యక్తిగతంగా హాజరు అవ్వడంపై మినహాయింపు నిచ్చారు. యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియాను పిటిషనర్‌గా చేర్చాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించారు.