TG : నిజామాబాద్ రూరల్ చక్రధర్ నగర్ తండాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతుండగా అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొని ఆరేళ్ల కీర్తన అనే బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డెంటల్ కాలేజీ విద్యార్థి కారు నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.