
రియాద్‌లోని యూఎస్ ఎంబసీపై ఇరాన్ దాడులు (వీడియో)
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ తన దాడులను తీవ్రతరం చేసింది. తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా ఎంబసీపై విరుచుకుపడింది. దాంతో ఈ ప్రాంతంలో మంటలు చెలరేగగా.. దట్టమైన పొగ అలముకుంది. రెండు డ్రోన్లతో యూఎస్ ఎంబసీపై దాడి జరిగిందని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.




