
భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటలు సమయం
TG: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు కావడంతో వివిధ రాష్ట్రాలు, పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు స్వామి వారి దర్శనానికి తరలివచ్చారు. టోకెన్‌లేని భక్తుల దర్శనానికి సుమారు 18 గంటలు పడుతుండగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి కేవలం 2 గంటల్లో అవకాశం కల్పిస్తున్నారు. సోమవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం 78,217 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.75 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.




