AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రామచంద్రపురంలో బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. భాష్యం పబ్లిక్ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్న రంజిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే అది ఆత్మహత్య కాదని, హత్యేనని రంజిత తల్లి ఆరోపించారు. హత్య చేసి ఫ్యాన్‌కి ఉరేశారని ఆరోపించారు. సీసీ కెమెరాలు పరిశీలించాలని డిమాండ్ చేశారు. కాగా, రంజిత తండ్రి ఉద్యోగరీత్యా ముంబైలో ఉంటున్నారు.