TG: వీధి కుక్కల దాడిలో ఓ బాలిక తీవ్రంగా గాయపడిన ఘటన హన్మకొండ జిల్లా న్యూశాయంపేటలో శనివారం చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న శ్రీజ(7) అనే బాలికపై వీధి కుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ క్రమంలో బాలిక అరుపులు విని ఓ వ్యక్తి పరుగెత్తుకు వచ్చి కుక్కలను తరమడంతో ప్రాణాపాయం తప్పింది. గాయపడ్డ బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.