వరదలో చిక్కుకుపోయిన అమ్మాయి (వీడియో)

24900చూసినవారు
ఫిలిప్పీన్స్‌లో కల్మేగీ తుఫాను సృష్టించిన బీభత్సంలో, సెబు సిటీలో వరద ఉధృతికి ఇళ్లన్నీ మునిగిపోయాయి. ఈ సమయంలో 13 ఏళ్ల బాలిక వరదలో తన ఇంటి గేటు పిల్లర్‌పై కూర్చొని ప్రాణాలు కాపాడుకుంది. ఈ క్రమంలో ఓ కారు కొట్టుకురావడం వైరల్ వీడియోలో కనిపించింది. బాలిక తండ్రి తెలిపిన వివరాల ప్రకారం, నీళ్లలోకి దూకమని చెప్పి ఆమెను వెంటనే కాపాడారు. వారు కొన్ని గంటలపాటు ఇంటి పైకప్పుపైనే ఉన్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.